ఆ ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఉండటానికి వీల్లేదు: ఏపీ టీడీపీ నేత యనమల
- మార్చిలో బడ్జెట్ సెషన్ ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది
- మండలి వ్యతిరేకించిన రెండు బిల్లుల ప్రస్తావన వద్దు
- అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
మార్చిలో బడ్జెట్ సెషన్ నిర్వహించేముందు రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ విధంగా అయితే బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారో, అదేవిధంగా గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేస్తుంటారని అన్నారు. శాసనమండలి వ్యతిరేకించిన రెండు బిల్లుల గురించిన ప్రస్తావన నిబంధనల ప్రకారం ఈ ప్రసంగంలో ఉండడానికి వీల్లేదని, అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వం పంపే ప్రసంగ కాపీని గవర్నర్ పరిశీలించాలని కోరారు.
ఒకవేళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాల గురించిన ప్రస్తావన ఉంటే కనుక సవరణలను ప్రతిపాదించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం కనుక మొండిగా వ్యవహరిస్తే మండలిలో ‘సేమ్ సీన్ రిపీట్’ అవుతుందని, ప్రతిపక్షం వ్యతిరేకత లేకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సూచించారు.