రైతు అయిన కేసీఆర్ సీఎంగా ఉన్నందునే వ్యవసాయరంగం అభివృద్ధిపథంలో పయనిస్తోంది: కేటీఆర్

  • డీసీసీబీ, డీసీఎంస్ విజేతలతో కేటీఆర్ సమావేశం
  • తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్న మంత్రి
  • రైతు బంధు, రైతు బీమా పథకాలు తీసుకువచ్చింది కేసీఆరేనని ఉద్ఘాటన
తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు అయిన కేసీఆర్ సీఎంగా ఉన్నందునే తెలంగాణలో వ్యవసాయరంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా, రైతు బంధు పథకాలను తీసుకువచ్చింది కేసీఆరేనని, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, అభిమానంతోనే రైతులు 906 సంఘాల్లో 94 శాతానికి పైగా విజయాలు అందించారని కేటీఆర్ అన్నారు. రైతు రుణమాఫీపై చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని వివరించారు.


More Telugu News