'పలాస 1978'కి 25 కట్స్ చెప్పారట!
- జానపద కళల నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు
- 25 ఏళ్లలో ఇలాంటి కథ రాలేదన్న దర్శకుడు
కొన్ని యథార్థ సంఘటనల నేపథ్యంలో 'పలాస 1978' సినిమా రూపొందింది. అప్పారావు - వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. రక్షిత్ - నక్షత్ర జంటగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి కరుణకుమార్ మాట్లాడాడు.
"జానపద కళల నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. జానపద కళలను నమ్ముకున్నవారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నారు? మార్కెట్ పరంగా కారణమవుతున్న దుష్టశక్తులు ఏమిటి? అనే కోణాల్లో ఈ కథ నడుస్తుంది. 25 ఏళ్లలో ఇలాంటి కథను ఎవరూ టచ్ చేయలేదు. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాలో 25 కట్స్ చెప్పారు. దాంతో తాము రివైజింగ్ కమిటీకి వెళితే, రెండు సంభాషణలను మాత్రమే తొలగించమని చెప్పి, సినిమా విడుదలకి అంగీకారాన్ని తెలిపారని అన్నాడు. ఈ సినిమా ఏ స్థాయి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.