ఢిల్లీ అల్లర్లపై ఎల్లుండి విచారించనున్న సుప్రీంకోర్టు

  • ఈరోజు విచారణ అనంతరం వాయిదా
  • ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు
  • మొత్తం 46 మంది మృతి
ఢిల్లీ అల్లర్లపై దాఖలైన పిటిషన్ పై ఈ నెల నాలుగో తేదీన విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈరోజు పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం అనంతరం వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య డిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో మొత్తం 46 మంది చనిపోయారు. ముఖ్యంగా, భాగీరథీ విహార్, గోకుల్ పురి మురుగునీటి కాల్వల నుంచి పెద్ద సంఖ్యలో శవాలు బయటపడడంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అల్లర్ల సందర్భంగా 254 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు 903 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయుధాల చట్టం కింద 41 మందిపై కేసులు పెట్టారు.


More Telugu News