ఖాళీ అయిన తిరుమల... ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు!

  • ముగిసిన వారాంతం, సమీపించిన పరీక్షలు
  • తిరుమలకు తగ్గిన భక్తుల రాక
  • నిన్న దర్శించుకున్న 83 వేల మంది
వారాంతం ముగియడం, పరీక్షల సీజన్ కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో, తిరుమల గిరులు ఖాళీ అయ్యాయి. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనానికి కేవలం ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి వున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి చూస్తున్న సాధారణ భక్తుల సంఖ్యతో పోలిస్తే, రూ. 300 ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ దర్శనం, దివ్య దర్శనం భక్తుల సంఖ్యే అధికంగా ఉంది. స్వామి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 83 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా సుమారు రూ. 3 కోట్ల ఆదాయం లభించింది.


More Telugu News