ఓరుగల్లు పట్టణ ప్రగతి కార్యక్రమంలో అపశృతి... చిన్నారి మృతి

  • పొక్లెయిన్ తాకడంతో కూలిన గోడ
  • ఆడుకుంటున్న చిన్నారిపై పడిన గోడ
  • అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన బాలిక
  • రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే వరంగల్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. హన్మకొండ కొత్తూరు జెండా ప్రాంతంలో మురుగు కాల్వ పనులు చేస్తున్న ఓ పొక్లెయిన్ గోడను తాకడంతో ఆ గోడ కూలిపోయింది. దాంతో ఆ గోడ పక్కనే ఆడుకుంటున్న ప్రిన్సీ అనే చిన్నారి సంఘటన స్థలంలోనే మరణించింది. మరో బాలుడు తీవ్రంగా గాయపడగా, నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, మరణించిన బాలిక కుటుంబానికి తెలంగాణ సర్కారు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. బాలిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహం వచ్చేలా చేస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ భాస్కర్ తెలిపారు.


More Telugu News