హైదరాబాద్ పోలీసుల ట్వీట్ పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
- చార్మినార్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు
- చార్మినార్ వద్దే ఎందుకు మార్చ్ నిర్వహించాల్సి వచ్చిందని ఆగ్రహం
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఇలా ఎందుకు చేయలేదని మండిపాటు
హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ సుప్రసిద్ధ పర్యాటక స్థలం మాత్రమే కాదు అత్యంత సున్నితమైన ప్రదేశం కూడా. అయితే, అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో కవాతు నిర్వహించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మహిళా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లు చార్మినార్ వద్ద మార్చ్ చేస్తున్న దృశ్యాన్ని హైదరాబాద్ నగర పోలీసులు ట్వీట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ, కేవలం చార్మినార్ వద్దే ఎందుకు మార్చ్ నిర్వహించారని నిలదీశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద, హైటెక్ సిటీ వద్ద, లేకపోతే నగరంలోని అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీల వద్ద ఎందుకు ఇలా చేయలేదని ప్రశ్నించారు.