రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్​ కల్యాణే: మంత్రి వెల్లంపల్లి

  • పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి
  • సొంత అన్నయ్య కష్టాల్లో ఉంటే పవన్ పట్టించుకోలేదు
  • పవన్ కు తనను నమ్మిన వ్యక్తులను పైకి తేవాలన్న ఆలోచన లేదు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి , రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆయనే అని విమర్శించారు. మొదట్లో ఏదో ట్రస్ట్ పెడుతున్నామని, దానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నానని పవన్ అన్నారని అది ఏమైందో తెలియదని విమర్శించారు.

నాడు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే క్షణం వరకూ చిరంజీవి వెంట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, సొంత అన్నయ్య కష్టాల్లో ఉంటే పక్కన ఉండాల్సిందిపోయి ఆయన్ని వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఇలాంటి వ్యక్తి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ లో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్ కల్యాణ్ కు రాజకీయ విలువలు లేవని, తనను నమ్ముకున్న వ్యక్తులను, క్యాడర్ ను పైకి తీసుకురావాలన్న ఆలోచన లేని వ్యక్తి పవన్ అని తీవ్ర విమర్శలు చేశారు. 


More Telugu News