ఏపీలో పింఛన్లు, తెల్లకార్డుల రద్దుపై మంత్రులు నోరు విప్పరే?: జనసేన నేత పోతిన మహేశ్​

  • ఈ విషయమై మంత్రులు సమాధానం చెప్పాలి
  • పశ్చిమ నియోజకవర్గంలో 15 వేల మందికి ఇళ్ల పట్టాలివ్వాలి
  • లేనిపక్షంలో మంత్రి వెల్లంపల్లి ఇంటిని ముట్టడిస్తాం
ఏపీలో పింఛన్ల తొలగింపు, తెల్లకార్డులు రద్దు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై జనసేన పార్టీ స్పందించింది. పింఛన్ల తొలగింపు, తెల్లకార్డులను రద్దు చేయడంపై మంత్రులు నోరు విప్పరే? అని ‘జనసేన’ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు. ఈ విషయమై మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో 15 వేల మందికి ఇళ్ల పట్టాలివ్వాలని, లేనిపక్షంలో ఉగాది పండగ మర్నాడు మంత్రి వెల్లంపల్లి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.  విజయవాడ, గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ‘జై అమరావతి’ అని నినదించాలని, అలా నినదించకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తగినబుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.


More Telugu News