రేవంత్ రెడ్డి భూముల వివాదంపై టీఆర్ఎస్‌ నేత బాల్క సుమన్‌ కీలక వ్యాఖ్యలు

  • రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు తెలుస్తోంది
  • వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలి
  • భూమిని తిరిగిచ్చేయాలి
  • రేవంత్‌వి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు 
రంగారెడ్డి జిల్లా గోపనపల్లి పరిధిలో సర్వే నంబర్‌ 127లో అక్రమ మ్యుటేషన్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవల ఆ జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పేర్ల మీద 6.24 ఎకరాల భూమిని మ్యుటేషన్లు చేయించుకున్నారని ఆరోపణలున్నాయి.

దీనిపై స్పందించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు తెలుస్తోందని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పి భూమిని తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం తెలంగాణలో చేస్తోన్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల వల్ల టీఆర్‌ఎస్‌ వైపే ప్రజలు ఉన్నారన్న విషయం తెలుస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.



More Telugu News