కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా ఫైర్
- రాష్ట్ర విభజనపై ఇప్పుడు వ్యాఖ్యానాలేమిటి?
- అర్ధరాత్రి చేశారన్న విషయం అప్పుడు తెలియదా
- చట్టాలను అవమానించడం సరికాదు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎప్పుడో జరిగిపోయిన రాష్ట్ర విభజన గురించి మంత్రి ఇప్పుడు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఈరోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాత్రిళ్లు రాష్ట్ర విభజన చేశారని అవహేళన చేయడం మంత్రి స్థాయికి తగదన్నారు. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియ జమ్ముకశ్మీర్‌కే వర్తిస్తుందనడం విడ్డూరమని విమర్శించారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తోందని ధ్వజమెత్తారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమమని, దీనిపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.