రెండు గ్లాసుల నీటితో మంచి ఫలితం : బరువు తగ్గేందుకు అద్భుత చిట్కా
- భోజనానికి ముందు తాగితే చాలు
- తక్కువ ఆహారం తీసుకునే అవకాశం
- రుజువు చేసిన వర్జీనియా పరిశోధకులు
లావుగా ఉన్నానని చింతిస్తున్నారా. బరువు తగ్గడం ఎలాగో అర్థంకాక ఆవేదన చెందుతున్నారా. అయితే ఈ చిట్కా పాటించండి. మూడు నెలల్లో మీలో మార్పు ఖాయం అంటున్నారు వర్జీనియా పరిశోధకులు. రోజూ భోజనానికి ముందు రెండు గ్లాసులు స్వచ్ఛమైన మంచితీరు తీసుకుంటే చాలని, దీనివల్ల మీ బరువు గణనీయంగా తగ్గడం ఖాయమని చెబుతున్నారు. ఊబకాయం ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్య. లావుగా ఉన్న వారు బరువు తగ్గేందుకు పడేపాట్లు అన్నీఇన్నీ కావు. ఆహారం, అలవాట్లు, వృత్తి ఉద్యోగాల ప్రభావంతో అమాంతం పెరిగే బరువును వదిలించుకోలేక చింతాక్రాంతులవుతుంటారు.
వ్యాయామానికి సమయంలేక, బద్దకం, ఇతరత్రా కారణాలతో కొందరు స్టెరాయిడ్లను ఆశ్రయిస్తారు. మరికొందరు లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. అయినా అనుకున్న ఫలితం రాక ఆవేదన చెందుతుంటారు. అయితే మన దాహాన్ని తీర్చే నీటితోటే బరువు తగ్గొచ్చంటున్నారు వర్జీనియా శాస్త్రవేత్తలు.
ఇక్కడి బ్లాక్‌బర్గ్‌కు చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్‌లోని టెక్‌లోని హ్యూమన్ న్యూట్రిషన్,ఫుడ్స్ అండ్ ఎక్సర్‌సైజెస్ విభాగం పరిశోధకులు ఆహారం తీసుకోబోయే ముందు రెండు గ్లాసుల నీరు తాగిన వారు 12 వారాల్లో 2 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. ఇందుకోసం 55 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 48 మందిపై ప్రయోగం జరిపారు.
వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఓ గ్రూపును మూడు పూటల ఆహారం తీసుకునే ముందు రెండు కప్పుల నీరు తాగేలా చేశారు. మరో గ్రూపుకు ఎలాంటి నిబంధన పెట్టలేదు. 12 వారాల తర్వాత భోజనాలకు ముందు నీరు తీసుకున్న వారు అదనంగా 2కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు.
ఇందుకు వారు చెప్పే కారణం ఏమిటంటే భోజనానికి ముందు 2 కప్పుల నీరు తీసుకోవడం వల్ల తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. తద్వారా తక్కువ కాలరీలు మన శరీరానికి అంది కొత్తగా కొవ్వు పేరుకుపోవటానికి అవకాశం ఉండదు. అందుకే బరువు తగ్గుతారని వీరు తేల్చారు.