లీడ్ 97 పరుగులు, పోయింది 6 వికెట్లు... ఇంకా మూడు రోజుల ఆట... వైట్ వాష్ తప్పదేమో!

  • రెండు రోజుల్లోనే ఫలితం దాదాపు ఖరారు
  • 7 పరుగుల ఆధిక్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్
  • 90 పరుగులకే ఆరు వికెట్లు ఫట్
క్రీస్ట్ చర్చ్ లో న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజే ఫలితం దాదాపు ఖరారైంది. తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన ఇండియా, ఆపై రెండో ఇన్నింగ్స్ లో పేలవంగా ఆడి 90 పరుగులకే అత్యంత కీలకమైన ఆరు వికెట్లను కోల్పోయింది. టాప్ 6 బ్యాట్స్ మెన్ లో ఎవరూ పట్టుమని పాతిక పరుగులు కూడా చేయకుండా పెవీలియన్ దారి పట్టారు.

ఓపెనర్ల్ పృథ్వీషా 14, మయాంక్ అగర్వాల్ 3, పుజారా 24, కోహ్లీ 14, రహానే 9, ఉమేశ్ణ యాదవ్ 1 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి హనుమ విహారి 5, రిషబ్ పంత్ 1 పరుగు చేసి క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు కాగా, ఇండియా 97 పరుగుల లీడ్ లో ఉంది.

న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ కు 3 వికెట్లు, సౌథీ, గ్రాండ్ హోమ్ వాగ్నర్ లకు తలో వికెట్ లభించాయి. ఇక రేపు ఉదయం మ్యాచ్ లో వీరిద్దరూ అద్భుతంగా రాణించకుంటే, ఈ మ్యాచ్ లో భారత్ పరాజయం దాదాపు ఖరారైనట్టేనని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. అయితే, పిచ్ సీమర్లకు పూర్తిగా సహకరిస్తోంది. రేపు కనీసం ఇంకో 100 లేదా 120 పరుగులను ఇండియా సాధిస్తే, గెలుపుపై అంచనాలు పెంచుకోవచ్చు. ఇన్ స్వింగర్లతో సత్తా చాటే షమీ, బుమ్రాలు రాణిస్తే, ఆసీస్ ఆటగాళ్లను వీళ్లిద్దరూ ముప్పుతిప్పలు పెట్టడం ఖాయం.

అయితే, ఇదే సమయంలో ఏ ఇద్దరు బ్యాట్స్ మెన్ నిలబడినా మ్యాచ్ స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా చూసినా రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ గెలుపునకే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.


More Telugu News