మీ నాయన రూ.200 ఇస్తే, మా నాయన రూ.2 వేలు ఇచ్చారు: జగన్‌పై లోకేశ్ ఫైర్
- సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా?
- ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు సమాచారం చేస్తున్నారు
- ఇదేమన్నా మీ దొంగ సాక్షి అనుకున్నారా?
'సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా?' అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ప్రభుత్వ ప్రకటనల్లో, ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటానికి, ఇదేమన్నా మీ దొంగ సాక్షి అనుకున్నారా ?' అని ప్రశ్నిస్తూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.
'జనవరి 2019 నుంచి మీరు ప్రజల నెత్తిన పడిన జూన్ 2019 దాకా, 54.47 లక్షల మందికి పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? మీ నాయన కేవలం రూ.200 ఇస్తే, మా నాయన 2014లో వెయ్యి రూపాయలు, 2019లో రెండు వేలు చేశారు. అంటే, పది రెట్లు ఎక్కువ' అని చెప్పారు.
'ఇప్పుడు తమరు వచ్చి, 3 వేల రూపాయలు అని మోసం చేసి, లింగులిటుకుమంటూ, రూ.250 పెంచి, మోసం చేసింది కాక, ప్రభుత్వ సొమ్ముతో, ఇలా అబద్ధపు డబ్బాలు కొట్టుకుంటారా?' అని నిలదీశారు.