ప్రియురాలు బ్లాక్ మెయిల్ తట్టుకోలేక ప్రియుడి సూసైడ్!
- కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఘటన
- డబ్బుకోసం ప్రియుడిని వేధించిన ప్రియురాలు
- సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సమద్ గౌడ
డబ్బు కోసం నిత్యమూ ప్రియురాలు పెట్టే హింసను తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బెళగావికి చెందిన సమద్ గౌడ (23) గత కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే, ఆ యువతి అతన్నుంచి పలుమార్లు డబ్బులు తీసుకుంది. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ, మరింత డబ్బు ఇవ్వాలని వేధిస్తోంది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను, సోమేశ్వర రైల్వే స్టేషన్ సమీపంలో సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ లేఖను రాసి తన వద్ద పెట్టుకున్నాడు. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రియురాలి వేధింపులు తట్టుకోలేకనే సమద్ గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కోణంలో కేసును విచారిస్తున్నారు. కాగా, ఇటీవల సమద్, తన స్నేహితుల వద్ద తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చెప్పి వాపోయాడని తెలుస్తోంది.