మతం పేరుతో ప్రజలను విడదీస్తారా?: అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు

  • ఢిల్లీ హింసాత్మక ఘటనలపై ఆవేదన
  • సెక్యులర్ దేశంలో మతం పేరుతో ప్రజలను విడదీయడం భావ్యం కాదన్న అమర్త్యసేన్
  • ఢిల్లీ బాధితుల్లో ఎక్కువమంది ముస్లింలేనని ఆవేదన
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారి 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంపై నోబెల్ విజేత, భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ విచారం వ్యక్తం చేశారు. హింసను అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు అసమర్థులుగా మిగిలిపోయారా? లేక, ప్రభుత్వమే విఫలమైందా? అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. రాజధానిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్న ఆయన.. సెక్యులర్ దేశమైన భారత్‌లో మతాల పేరుతో ప్రజల్ని విడదీయడం సరికాదన్నారు. ఢిల్లీ బాధితుల్లో ఎక్కువమంది ముస్లింలేనని అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News