ఎస్సై సునీతపై చెప్పుతో దాడిచేసిన వైసీపీ మహిళా నేత కృపాజ్యోతి అరెస్ట్

  • రంగంలోకి దిగిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
  • కృపాజ్యోతితో ఎస్సైకి క్షమాపణలు చెప్పిస్తామన్న మంత్రి
  • రిమాండ్‌కు తరలించకుండా స్టేషన్ బెయిలుపై విడుదల చేసిన పోలీసులు
మహిళా ఎస్సైపై చెప్పుతో దాడి చేసి పక్కకు నెట్టేసిన ఘటనలో విశాఖపట్టణం తూర్పు నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు అడ్డాల కృపా జ్యోతిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు విశాఖపట్టణం విమానాశ్రయానికి వైసీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో  విమానాశ్రయ పోలీస్ స్టేషన్ ఎస్సై ఎన్.సునీతపై కృపాజ్యోతి చెప్పుతో దాడి చేసి పక్కకు తోసేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన పలువురు వైసీపీ మహిళా నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఆమెను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. విషయాన్ని వైసీపీ నేతలు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన డీసీపీ-2 ఉదయ్ భాస్కర్‌తో మాట్లాడారు. ఎస్సై సునీతకు క్షమాపణ చెబుతామని, కేసులు విరమించుకోవాలని ఆయన కోరడంతో కృపారాణిని రిమాండ్‌కు తరలించకుండా పూచీకత్తుపై స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు.


More Telugu News