మూడు రోజుల బ్యాంకుల సమ్మె రద్దు!

  • 11 నుంచి మూడు రోజుల సమ్మెకు పిలుపు
  • యూనియన్లతో చర్చించిన ఐబీఏ
  • సమ్మెను విరమించుకుంటున్నామన్న ఏఐబీఈఏ
దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి మూడు రోజుల సమ్మెను తలపెట్టిన బ్యాంకు యూనియన్లు, దాన్ని రద్దు చేసుకున్నాయి. ముంబైలో ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల్లో సానుకూల నిర్ణయాలు వెలువడ్డాయని, దీంతో సమ్మెకు దిగరాదని నిర్ణయించుకున్నామని ఏఐబీఈఏ (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమ్మెను బ్యాంకింగ్ సెక్టార్ లోని యూనియన్ల బాడీ యూఎఫ్బీయూ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

బ్యాంకు యూనియన్లతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలు జరిపిందని, 15 శాతం వరకూ వేతనాలు పెంచేందుకు, ఐదు రోజుల పనిదినాలను అమలు చేసే విషయంలోనూ చర్చలు జరిగాయని ఏఐబీఈఏ పేర్కొంది. యూనియన్లు లేవనెత్తిన ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించింది. కాగా, జనవరి 31 నుంచి రెండు రోజుల సమ్మెకు దిగిన బ్యాంకు యూనియన్లు, తమ సమస్యలు పరిష్కారానికి నోచు కోలేదని చెబుతూ, మార్చిలో మూడు రోజుల సమ్మెకు దిగనున్నట్టు నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే.


More Telugu News