తమిళ నటి శ్రుతి ప్రేమగారడీ... పలువురితో పెళ్లి నాటకం... లక్షల్లో మోసం!
- ఓ ఫ్లాప్ సినిమాలో నటించిన శ్రుతి
- అవకాశాలు రాక పెడదారిలో
- పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
ఆమె పేరు శ్రుతి. తమిళంలో 'ఆడి పోనా ఆవని' అనే చిత్రంలో నటించింది. అయితే, అది ఫ్లాప్ కావడంతో సరైన అవకాశాలు రాక పెడదారి పట్టింది. పలువురిని పెళ్లి పేరిట మోసం చేసి లక్షల్లో ముంచేసింది. పెరంబూరు పోలీసులు ఆమె ప్రేమ గారడీ గుట్టును రట్టు చేశారు.
వివరాల్లోకి వెళితే, శ్రుతికి వివాహం చేయాలని తలపెట్టిన తల్లిదండ్రులు, ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో పేరు నమోదు చేశారు. జర్మనీలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కోవై యువకుడు బాలమురుగన్ ఆమెను సంప్రదించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా పరిచయం పెరుగగా, తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, డబ్బులు కావాలని కోరింది. కాబోయే భార్యే కదా అని బాలమురుగన్ రూ. 45 లక్షలను ఆమెకు ఇచ్చాడు. ఆ డబ్బు చేతికి అందిన తరువాత అతన్ని దూరం పెట్టింది. దీంతో శ్రుతి తనను మోసం చేసిందని అర్థం చేసుకున్న బాలమురుగన్, కోవై పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు విచారణ చేపట్టగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె చేతిలో మోసపోయిన వారు చాలా మందే ఉన్నారని, వారి నుంచి కాజేసిన డబ్బుతో శ్రుతి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తోందని తేల్చారు. ఈ కేసులో శ్రుతి, ఆమె తల్లి చిత్ర, సోదరుడు సుభాష్ లను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించగా, బెయిల్ పై బయటకు వచ్చిన శ్రుతి, చదువు పేరిట లండన్ కు వెళ్లింది. అయినా తన బుద్ధిని మార్చుకోలేదు.
ఈమె మోసానికి చెన్నైకి చెందిన అముదన్ వెంకటేశన్ అనే మరో యువకుడు కూడా బలయ్యాడు. అయితే, శ్రుతిపై అధిక ఆశలు పెంచుకున్న అముదన్, పెళ్లికి ఆమె నిరాకరిస్తున్నదని అర్థం చేసుకుని బెదిరింపులకు దిగాడు. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, వీడియోను పంపాడు. చెన్నైకి వస్తే యాసిడ్ పోస్తానని భయపెట్టాడు. దీనిపై శ్రుతి తల్లి చిత్ర, రెండు రోజుల క్రితం మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారించారు. అముదన్ సుమారు రూ. 10 లక్షలు శ్రుతికి ఇచ్చాడని గుర్తించారు. అముదన్ ను, అతని తండ్రి రాజగోపాల్ ను అదుపులోకి తీసుకుని, ఇకపై ఇటువంటి బెదిరింపులకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి, సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.