భారత పేస్ దాటికి న్యూజిలాండ్ కకావికలం... 150 పరుగులకే 7 వికెట్లు!
- 3 పరుగులకే అవుట్ అయిన విలియమ్సన్
- వాట్లింగ్, సౌథీ డక్కౌట్
- 3 వికెట్లు తీసిన జస్ ప్రీత్ బుమ్రా
క్రీస్ట్ చర్చ్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ను 242 పరుగులకు పరిమితం చేసిన న్యూజిలాండ్, తొలుత ఆ స్కోరును దాటేలానే కనిపించింది. ఓపెనర్లు లాథమ్ 52, బ్లండెల్ 30 పరుగులు చేసి శుభారంబాన్ని అందించినా, కెప్టెన్ విలియమ్సన్ 3 పరుగులకు అవుట్ కావడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.
భారత పేస్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీల ధాటికి మిడిలార్డర్ కుప్పకూలింది. టేలర్ 15 పరుగులకు, నికోలస్ 14 పరుగులకు అవుట్ కాగా, వాట్లింగ్, సౌథీలు డక్కౌట్ అయ్యారు. దీంతో ఆ జట్టు కీలక వికెట్లను అన్నింటినీ కోల్పోయింది. ప్రస్తుతం గ్రాండ్ హోమ్ 19 పరుగులతో క్రీజులో ఉండగా, అతనికి జెమీసన్ వచ్చి చేశారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 52 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు. భారత బౌలర్లలో బుమ్రాకు 3, షమీకి 2 వికెట్లు లభించగా, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ ను పడగొట్టారు.