రాజ్యసభకు ప్రశాంత్ కిశోర్... ఖరారు చేసిన మమతా బెనర్జీ!
- ఇటీవల జేడీయూకు దూరమైన ప్రశాంత్ కిశోర్
- రాజ్యసభలో నాలుగు సీట్లను గెలుచుకోనున్న టీఎంసీ
- బీజేపీని ఎదుర్కొనేందుకు పీకే ఉండాలనుకుంటున్న మమత
ఎన్నికల వ్యూహకర్త, ఇటీవలే జేడీయూకు దూరమైన ప్రశాంత్ కిశోర్ ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా 17 రాష్ట్రాల్లోని 55 స్థానాలకు ఎలక్షన్ జరుగనుందన్న సంగతి తెలిసిందే. టీఎంసీకి చెందిన నలుగురు పదవీ విరమణ చేయనున్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా చూస్తే, నాలుగు స్థానాలనూ టీఎంసీ తిరిగి గెలవడం ఖాయం.
కేంద్రంలోని బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, ప్రశాంత్ కిశోర్ ఉండాలని మమతా బెనర్జీ భావించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో బీజేపీ అమలులోకి తెచ్చిన వివాదాస్పద చట్టాలపై ప్రశాంత్ కిశోర్, బహిరంగ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జేడీయూకు దూరమైన తరువాత ప్రశాంత్ కిశోర్, మమతకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా సేవలందించేందుకు చేతులు కలిపారు. వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపునకు ఆయన తనవంతు సహకారాన్ని అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పెద్దల సభకు పంపిస్తే, పార్టీ మరింతగా బలపడుతుందని మమత అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.