ఏపీలో మళ్లీ పెట్రో, డీజిల్​ ధరల పెంపు

  • పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ రూపంలో పన్ను పెంపు
  • లీటర్ పెట్రోల్ కు 76 పైసలు, డీజిల్ కు రూ.1.07 పైసలు పెంపు
  • రేపటి నుంచి అమల్లోకి రానున్న పెరిగిన ధరలు 
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోమారు పెరిగాయి. వీటిపై వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ కు 76 పైసలు, లీటర్ డీజిల్ కు రూ.1.07 పైసలుగా ఉంటుంది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్ పై 31 శాతం వ్యాట్ తో పాటు రెండు రూపాయలు అదనంగా వసూలు చేస్తుండగా.. ఇప్పుడు పెరిగిన దాంతో కలుపుకుని 2.76 సర్ ఛార్జీ వసూలు చేస్తారు. డీజిల్ పై 22.25 శాతం వ్యాట్ తో పాటు అదనంగా రెండు రూపాయలు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు పెరిగిన దాంతో కలుపుకుని రూ.3.07 వసూలు చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News