ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు కరోనా ముప్పు.. వైద్య నిపుణుల హెచ్చరిక
- ఆఫ్ఘనిస్థాన్‌లో తొలి కరోనా కేసు
- వైద్యం కోసం ఆ దేశం నుంచి ప్రతి నెల ఢిల్లీకి వంద మంది రోగులు
- వైద్య, వాణిజ్య వీసాలు కొనసాగిస్తున్న ప్రభుత్వం
- నిలిపివేస్తే మంచిదని సూచన
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌లోకి కరోనా వైరస్ ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్ వాసులకు వైద్య, వాణిజ్య వీసాలు మంజూరు చేయడమే ఇందుకు కారణమని అంటున్నారు. ప్రతి నెల వంద మందికి పైగా ఆఫ్ఘన్ రోగులు వైద్యం కోసం దేశ రాజధానికి ఢిల్లీకి వస్తున్నారు. అయితే, ఆఫ్ఘన్‌లో బుధవారం ఓ కరోనా కేసు నమోదైనప్పటికీ.. భారత ప్రభుత్వం ఆ దేశంపై ఇలాంటి ఆంక్షలు విధించడం లేదు.
ప్రస్తుతం చైనా అవతల ఇరాన్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. యాత్రికుల ద్వారా వైరస్ ఇరాన్ నుంచి సౌదీ అరేబియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌కు పాకింది. ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు వైరస్ విస్తరిస్తోంది. దాంతో, ఆఫ్ఘన్ నుంచి వచ్చే రోగుల్లో ఎవరిలోనైనా కరోనా వైరస్ ఉంటే అది మన దేశంలోనూ విస్తరించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఆఫ్ఘన్ ప్రయాణికులపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సి ఉందని భావిస్తున్నారు.
ఇరాన్, సౌత్ కొరియా, ఇటలీ, పాకిస్థాన్, సౌదీతో పాటు ఆఫ్ఘన్ ప్రజలు చైనాకు వెళ్లడం కానీ, ఆ దేశ ప్రయాణికులతో కలసి తిరగడం కానీ చేసిన దాఖలాలు లేవు. అయినా ఆ దేశంలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో భారత్ ముందు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.