పోలీసులు నన్నో ఉగ్రవాదిలా చూస్తున్నారు: యూపీ ఎంపీ ఆజం ఖాన్​

  • పోలీసులపై ఆరోపణలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు
  • ఫోర్జరీ కేసులో అరెస్టైన ఆజం ఖాన్, భార్య, కొడుకు
  • ఏడు రోజుల జ్యుడిషల్ కస్టడీ విధించిన కోర్టు
యూపికి చెందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్‌‌ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు ఆజం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తనను ఉగ్రవాదిలా చూస్తున్నారని ఆరోపించారు. ఫోర్జరీ కేసులో అరెస్టైన ఆజం ఖాన్‌ను పోలీసులు సీతాపూర్‌‌ జైలు నుంచి తీసుకొచ్చి రాంపూర్‌‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసు వ్యాన్‌లో నుంచి విలేకరులతో మాట్లాడిన ఆజం ఖాన్‌ పోలీసులు తనను టెర్రరిస్టులా చూస్తున్నారని అన్నారు. కాగా, ఈ కేసులో ఆజం ఖాన్‌, ఆయన భార్య తజీన్‌ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజంకు రాంపూర్‌‌ కోర్టు ఏడు రోజుల జ్యుడిషల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.


More Telugu News