విద్యుత్ వినియోగంలో రికార్డులు బద్దలుగొట్టిన తెలంగాణ

  • నిన్న 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ 
  • వినియోగం ఒక్కసారిగా పెరిగినా కోతలు, లోటు లేకుండా సరఫరా
  • తలసరి వినియోగంలో తెలంగాణ టాప్
విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఏకంగా 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. అలాగే, తలసరి విద్యుత్ వాడకంలో మరో రికార్డు నమోదైంది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినా కోత, లోటు లేకుండా సరఫరా చేసినట్టు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఉమ్మడి ఏపీలో 23 మార్చి 2014న 13,162 మెగావాట్లు నమోంది. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంతకుమించి నమోదు కావడం విశేషం. ఇక, గతేడాది సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 28)న 9,770 మెగావాట్లగా నమోదైంది. అప్పటితో పోలిస్తే ఇది ఏకంగా 34 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

జాతీయ తలసరి సగటు విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణలో ఇది 1,896 యూనిట్లుగా ఉంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు వ్యవసాయానికి నాలుగైదు గంటలకు మించి విద్యుత్ సరఫరా అయ్యేది కాదని, కానీ రాష్ట్రం ఏర్పడిన 9 నెలల వ్యవధిలోనే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించినట్టు సీఎండీ తెలిపారు.


More Telugu News