సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న బంగ్లా యువతి.. దేశం విడిచి వెళ్లాలంటూ హోంశాఖ నోటీసు
- 2018లో విశ్వభారతి యూనివర్సిటీలో చేరిన విద్యార్థిని
- సీఏఏ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న అఫ్సర
- 15 రోజుల్లో దేశం విడిచిపెట్టాలంటూ నోటీస్
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశంలో ఉండేందుకు అనర్హులని, వెంటనే దేశం విడిచి వెళ్లాలని పేర్కొంటూ బంగ్లాదేశ్ యువతికి కేంద్ర హోంశాఖ నోటీసు జారీ చేసింది. అఫ్సర అనే యువతి 2018లో కోల్‌కతాలోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది డిగ్రీ చదువుతోంది. యూనివర్సిటీలో గతేడాది డిసెంబరులో జరిగిన పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనల్లో ఆమె పాల్గొంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసుకుంది.
ఇవి చూసిన నెటిజన్లు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ అఫ్సరకు ‘లీవ్ ఇండియా నోటీస్’ ఇవ్వడానికి ఇదే కారణమని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు. వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారు దేశంలో ఉండడానికి వీల్లేదని, 15 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ ఆ నోటీసులో పేర్కొంది. కాగా, ఆమధ్య ఐఐటీ మద్రాసులో చదువుతున్న జర్మనీ విద్యార్థికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.