అమరావతి రైతుల పరిస్థితిపై కోదండరాం వ్యాఖ్యలు

  • ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయని వ్యాఖ్యలు
  • రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలని హితవు
  • ఎక్కడ సచివాలయం ఉంటే అదే రాజధాని అన్న కోదండరాం
ఏపీలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు పోరాడుతుండడంపై తెలంగాణ నేత, టీజేఎస్ అధినేత కోదండరాం స్పందించారు. మూడు రాజధానులు ఎక్కడా ఉండవని, ఎక్కడ సెక్రటేరియట్ ఉంటే అదే రాజధాని అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అమరావతిలో పరిణామాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నారు. ఏ రైతును కదిపినా, ఏ మహిళను అడిగినా కన్నీళ్లతో బదులిస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పట్ల ఏపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు స్వాగతించారని పేర్కొన్న కోదండరాం, ఎమ్మెల్యేలు, అధికారుల బృందం ఓసారి అమరావతిలో పర్యటించాలని సూచించారు.


More Telugu News