ప్రోత్సాహకాలపై తర్వాత ఆందోళన చెందవచ్చు, ముందు ప్రజల్లో నమ్మకం కలిగించండి: కరోనాపై రఘురాం రాజన్ వ్యాఖ్యలు

  • చైనా సహా అనేక దేశాల్లో కరోనా బీభత్సం
  • నష్టాలపాలవుతున్న స్టాక్ మార్కెట్లు
  • ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి రంగంపై ప్రభావం
చైనాను అతలాకుతలం చేస్తూ, ఇతర దేశాలను కూడా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ కారణంగా  అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలతో ముగుస్తున్నాయి. దీనిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు.

 కరోనా భయంతో మందగించిన ఉత్పత్తి రంగాన్ని గాడినపెట్టేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించడం కాకుండా, ఈ వైరస్ వ్యాప్తికి కూడా ఓ పరిమితి ఉంటుందన్న నమ్మకం కలిగించాలని, వైరస్ వ్యాప్తికి విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగితే అదే ఉత్తమమైన ఆర్థిక ఔషధమని అభిప్రాయపడ్డారు. ప్రజలకు వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కలిగిస్తే, దాని నివారణపై ఏదో ఒక మార్గం ఉంటుందన్న ఆశాభావం వారిలో కలుగుతుందని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రోత్సాహకాల గురించి అతిగా ఆలోచించకుండా, మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడంపై దృష్టిసారించాలని హితవు పలికారు.


More Telugu News