మహిళల టీ20 వరల్డ్​కప్‌లో దక్షిణాఫ్రికా రికార్డు స్కోరు

  • టీమిండియా రికార్డు బద్దలు
  • ఓపెనర్‌‌ లిజెల్లే లీ సూపర్ సెంచరీ
  • థాయ్ లాండ్‌పై 113 పరుగుల తేడాతో ఘన విజయం
మహిళల టీ20 వరల్డ్కప్లో దక్షిణాఫ్రికా రికార్డు స్కోరు నమోదు చేసింది. థాయ్‌లాండ్తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన ఆ జట్టు 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్‌ చేసిన ప్రొటీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఈ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. దాంతో, 2018 వరల్డ్కప్లో న్యూజిలాండ్పై భారత్ చేసిన 194/4 పరుగుల రికార్డు బద్దలైంది.

సఫారీ టీమ్‌ ఓపెనర్‌‌ లిజెల్లే 60 బంతుల్లోనే  101 పరుగులతో రెచ్చిపోయింది. ఆమె ఏకంగా 16 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడింది. వన్‌డౌన్‌లో వచ్చిన సునె లూస్ 61 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టుకు భారీ స్కోరు అందించింది. అనంతరం 196 పరుగుల లక్ష్య ఛేదనలో థాయ్లాండ్ జట్టు 19.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. షబ్నిమ్ ఇస్మాయిల్, సూన్ చెరో మూడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు.


More Telugu News