12 మంది జర్నలిస్టుల ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- జర్నలిస్టులపై విమర్శలు
- చట్టబద్ధమైన హెచ్చరిక అని వ్యాఖ్య
- అసత్యాన్ని అమ్మాలనుకుంటే.. మీడియాను కొనాలని కొందరనుకుంటారు
దేశంలోని పలు టీవీ న్యూస్ ఛానెళ్లకు చెందిన 12 మంది జర్నలిస్టుల ఫొటోలు పోస్ట్ చేసిన సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చట్టబద్ధమైన హెచ్చరిక... అసత్యాన్ని అమ్మాలని వారు అనుకుంటే, మీడియాను కొనాలని కొందరు అనుకుంటారు' అని పేర్కొన్నారు. జస్ట్‌ఆస్కింగ్ అంటూ హ్యాష్‌ట్యాగ్ జోడించారు.
కాగా, సీఏఏపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో చోటు చేసుకుంటున్న అల్లర్లలో 35 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు జాతీయ మీడియాను కొన్నారంటూ నెటిజన్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు.