సినీనటుడు ప్రకాశ్ రాజ్‌కు మద్రాసు హైకోర్టు సమన్లు.. ఏప్రిల్ 2లోగా హాజరవ్వాలని ఆదేశం
- నడిగర్ అనే తమిళ సినిమా నిర్మించిన ప్రకాశ్ రాజ్
- ఓ బాలీవుడ్ ఫైనాన్సియర్ వద్ద రూ.5 కోట్ల అప్పు
- ఇటీవల ఆయనకు చెక్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
- బౌన్స్ అవడంతో కేసు
సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు చెక్‌బౌన్స్ కేసులో సమన్లు జారీ అయ్యాయి. ఆయన నిర్మించిన నడిగర్ అనే తమిళ సినిమా కోసం ఓ బాలీవుడ్ ఫైనాన్సియర్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల ఆయనకు ప్రకాశ్ రాజ్ చెక్ ఇచ్చారు.
అయితే, ఆ ఫైనాన్సియర్ ఆ చెక్‌ను బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అవడంతో ఆయన మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కి న్యాయమూర్తి సమన్లు జారీ చేసి, ఈ కేసులో ఏప్రిల్ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించారు. ప్రకాశ్‌రాజ్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.