పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఏచూరి.. ప్రతిపాదించిన పార్టీ
- వచ్చే నెల 26న ఐదు స్థానాలకు ఎన్నికలు
- నాలుగు స్థానాలకు పోటీపడుతున్న టీఎంసీ
- కాంగ్రెస్ మద్దతుతో పోటీపడనున్న సీపీఎం
వచ్చే నెల 26న పశ్చిమ బెంగాల్‌లో ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఆయన పేరును ప్రతిపాదించింది. ఈ విషయంలో ఏచూరికి మద్దతుగా నిలవాల్సిందిగా కాంగ్రెస్‌ను కోరనుంది. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం.
మరోవైపు, నాలుగు స్థానాల నుంచి టీఎంసీ బరిలోకి దిగుతుండగా, సీపీఎం-కాంగ్రెస్ కానీ, టీఎంసీ-కాంగ్రెస్ కానీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్‌తో కలిసి ఏచూరిని నిలబెట్టాలని సీపీఎం భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీకి రాజ్యసభకు పోటీ పడే అవకాశం లేదని సమాచారం.