కోవిడ్ - 19 ఎఫెక్ట్... భారీగా పడిపోయిన క్రూడాయిల్ ధర!
- 5 శాతం పడిపోయిన ధర
- 54.61 డాలర్లకు బ్రెంట్ క్రూడాయిల్
- ప్రపంచ జీడీపీకి తీవ్ర నష్టమంటున్న నిపుణులు
ప్రాణాంతక కోవిడ్-19 (కరోనా వైరస్) రోజుకో దేశానికి విస్తరిస్తుండటంతో, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్న వేళ, క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. ఇంటర్నేషనల్ ఫ్యూచర్స్ మార్కెట్ లో క్రూడ్ ధర 5 శాతానికి పైగా పడిపోయింది. నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 47.10 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ కు 54.61 డాలర్లకు పడిపోయింది.
ముడి చమురు మార్కెట్ కు కీలకమైన 42 డాలర్ల వద్ద కొనుగోలు మద్దతు రాకుంటే, 26 డాలర్ల వరకూ ధర పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే, క్రూడాయిల్ ధర మూడేళ్ల కనిష్ఠానికి పతనమైనట్లు అవుతుంది. కాగా, కరోనా కారణంగా ప్రపంచ జీడీపీ 0.30 శాతం వరకూ లేదా 250 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతుందని పారిశ్రామిక చాంబర్ పీహెచ్‌డీసీసీఐ అంచనా వేసింది.