తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ!

  • 14 కంపార్టుమెంట్లలో భక్తులు
  • సర్వ దర్శనానికి 13 గంటల సమయం
  • గురువారం స్వామిని దర్శించుకున్న 66 వేల మంది
నిన్నటి వరకూ సాధారణ స్థాయిలో ఉన్న తిరుమల భక్తుల రద్దీ, నేడు ఒక్కసారిగా పెరిగిపోయింది. వారాంతం రావడంతో పెద్దఎత్తున భక్తులు కొండకు చేరుకున్నారు. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. గురువారం స్వామివారిని 66,474 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా, శనివారం నాడు సమావేశం కానున్న టీటీడీ పాలకమండలి, 2020-21వ సంవత్సరానికి గాను బడ్జెట్‌ కు ఆమోదం తెలుపనుంది.


More Telugu News