ఓ దివ్యాంగుడికి తన ట్రస్టులో బాధ్యతలు అప్పగించిన రాఘవ లారెన్స్
- శివకుమార్ అనే దివ్యాంగుడి గురించి ట్వీట్ చేసిన లారెన్స్
- అతనెంతో నిజాయతీ ఉన్న కుర్రాడని కితాబు
- ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగిస్తారని వెల్లడి
సినీ డ్యాన్సర్ గా ప్రస్థానం ఆరంభించి, కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా బహుముఖ ప్రతిభ చాటుకున్న సెలబ్రిటీ రాఘవ లారెన్స్. సినీ ప్రముఖుడిగానే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఆయన గుర్తింపు అందుకున్నారు. ముఖ్యంగా, దివ్యాంగుల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, ఎంతో ఆర్థిక సాయం చేశారు. తన సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో కానీ, పాటలో కానీ దివ్యాంగులు ఉండేలా చూసుకుంటారు.
తాజాగా తన ట్రస్టు హైదరాబాద్ విభాగంలో శివకుమార్ అనే దివ్యాంగుడికి కీలక బాధ్యతలు అప్పగించారు. దీనిపై లారెన్స్ స్వయంగా వెల్లడించారు. "శివకుమార్ ఎంతో నిజాయతీ ఉన్న కుర్రాడు. అంతేకాదు, అతను కష్టజీవి కూడా. ఇలాంటి వాళ్లను మనం ఎంత ప్రోత్సహిస్తే వాళ్లంతగా ఇతరులకు స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. ఇతన్ని మీరు కూడా మనసారా ఆశీర్వదించండి" అంటూ ట్వీట్ చేశారు.