చేతిలో దరఖాస్తు పట్టుకుని ఉన్న ఓ వృద్ధుడ్ని చూసి కారు దిగిన సీఎం కేసీఆర్
- వృద్ధుడికి కేసీఆర్ ఆత్మీయ పరామర్శ
- తన సమస్యలు సీఎంకు చెప్పుకున్న వృద్ధుడు
- సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన కలెక్టర్
- వృద్ధుడికి కొద్దివ్యవధిలోనే పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు
సీఎం కాన్వాయ్ వెళుతుందంటే గమ్యస్థానం చేరేవరకు మధ్యలో ఆగడం జరగదు. కానీ సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో తన కాన్వాయ్ ని ఆపించి ఓ వృద్ధుడి సమస్యను తీర్చారు. కేసీఆర్ హైదరాబాద్ లోని టోలీచౌకీలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా, మార్గమధ్యంలో చేతిలో దరఖాస్తు పట్టుకున్న ఓ వృద్ధుడు కనిపించాడు. దాంతో వెంటనే తన వాహనం నిలిపిన కేసీఆర్ ఆ వృద్ధుడ్ని పరామర్శించారు. మహ్మద్ సలీం అనే వృద్ధుడి సమస్యలేంటో సావధానంగా విన్నారు.
వెంటనే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతిని ఆదేశించి సలీమ్ సమస్యలపై సత్వరమే స్పందించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశించడంతో ఫైళ్లు పరుగులు పెట్టాయి. కొద్దివ్యవధిలోనే పెన్షన్ మంజూరు చేయడమే కాదు, డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా మంజూరు చేశారు. సలీమ్ కు, అతని కుమారుడికి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరించాలని నిర్ణ యించారు.