కర్నూలు బాలిక సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
- 2017లో కర్నూలులో సంచలనం సృష్టించిన బాలికపై హత్యాచారం
- ఇప్పటికీ న్యాయం జరగని వైనం
- ఇటీవల సీఎం జగన్ ను కలిసిన బాలిక తల్లిదండ్రులు
- కేసును సీబీఐకి అప్పగిస్తానని వారికి హామీ ఇచ్చిన సీఎం
కర్నూలులో 2017లో సుగాలి ప్రీతి అనే బాలికపై అత్యాచారం, ఆపై హత్య ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘటనలో ఇంతవరకు న్యాయం జరగలేదు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల సీఎం జగన్ కంటివెలుగు కార్యక్రమం కోసం కర్నూలు వెళ్లినప్పుడు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆయన్ను కలిశారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు.