ఇక ఏపీ ప్రజల భవిష్యత్తును ఆ దేవుడే కాపాడాలి: యనమల, వర్ల రామయ్య
- విశాఖలో చంద్రబాబు కాన్వాయిపై దాడి హేయమైన చర్య
- ఇలాగైతే రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది?
- విశాఖలో జగన్ చేసిన భూకబ్జాలు బయటపడతాయనే భయం
- చంద్రబాబు పర్యటనకు ఆటంకం కలిగిస్తారని పోలీసులకు తెలుసు
విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తోన్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. విశాఖలో జగన్ చేసిన భూకబ్జాలు బయటపడతాయనే వైసీపీ నేతలు భయపడుతున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు.
చంద్రబాబు కాన్వాయిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం హేయమైన చర్యని యనమల అన్నారు. వైసీపీ నేతలు తమ స్వార్థపూరిత ప్రయోజనాలకు పోలీసులను వాడుకుంటున్నారని విమర్శించారు.
40 ఏళ్లుగా తాను ఇంతటి అసహాయ పోలీసులను చూడలేదని వర్ల రామయ్య మండిపడ్డారు. 'ఈ రోజు విశాఖలో జరిగింది చూడండి. వైసీపీ అడ్డుకుంటోంది.. చంద్రబాబుని అడుగు పెట్టనివ్వబోమని అంటున్నారు. పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు. ఎందుకు రోడ్లపైకి రానిచ్చారు?' అని మండిపడ్డారు.
'చంద్రబాబు పర్యటనకు ఆటంకం కలిగిస్తారని పోలీసులకు తెలుసు. అయినప్పటికీ వైసీపీ కార్యకర్తలను ఎందుకు అడ్డుకోలేదు? వారిని ఎందుకు గృహ నిర్బంధం చేయలేదు? ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇదే రకమైన పరిస్థితులు కొనసాగితే ఎలా? ఈ రకమైన పరిస్థితి కొనసాగితే ఏపీ ప్రజల భవిష్యత్తును ఆ దేవుడే కాపాడాలి' అని వర్ల రామయ్య అన్నారు.