అదరగొట్టిన భారత అమ్మాయిలు.. తీవ్ర ఉత్కంఠ రేపిన టీ20లో గెలిచి సెమీస్‌కు టీమిండియా
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో తలబడుతోన్న టీమిండియా అమ్మాయిలు
- మెల్‌బోర్న్‌లో మూడో వన్డేల్లోనూ విజయం
- మొదట బ్యాటింగ్ చేసి 133 పరుగులు చేసిన అమ్మాయిలు
- 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేసిన న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా అమ్మాయిలు ఈ రోజు కూడా అదరగొట్టేశారు. వరుసగా మూడు విజయాలు సాధించారు. మెల్‌బోర్న్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో లీగ్ టీ20లో 4 పరుగుల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. దీంతో భారత్ సెమీస్‌కు చేరింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అమ్మాయిలు 134 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచారు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 129 పరుగులు మాత్రమే సాధించింది.
కాగా, టీమిండియా నుంచి షెఫాలీ వర్మ 46 పరుగులు చేసి విజయానికి కారణమైంది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తానియా భాటియా 23 పరుగులు చేసింది. బౌలర్లలో దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్‌లకు తలా ఒక వికెట్ దక్కింది.