పాలకొల్లు 'స్థల' మహిమ.. గజం ధర రూ.2.50 లక్షలు పలికిన వైనం!
- క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో భూమి
- మొత్తం 200 గజాల భూమిని కొన్న వ్యక్తి
- మహాత్మాగాంధీ రోడ్డుకి పక్కనే భూమి
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఎన్నడూ లేని విధంగా గజం భూమి ధర రూ.2.50 లక్షలు పలికింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఈ స్థలం ఉంటుంది. సాధారణంగా ఆ పట్టణంలో గజం రూ.32 నుంచి 40 వేల మధ్యలో ఉంటుంది. అయితే, ఆలయానికి సమీపంలో ఉన్న స్థలాన్ని ఓ వ్యక్తి గజానికి రూ.2.50 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుని, ఆశ్చర్యపర్చారు.
రెండు ప్రతులుగా ఆ వ్యక్తి మొత్తం 200 గజాల స్థలాన్ని కొన్నారు. ఒక భాగంలో గజానికి రూ.1.75 లక్షలు చెల్లించారు. మహాత్మాగాంధీ రోడ్డుకి పక్కనే ఈ స్థలం ఉంటుంది. గతంలో పెద్ద నోట్ల రద్దుకు ముందు ఇక్కడి భూమి గరిష్ఠంగా గజం రూ.1.25 లక్షలకు అమ్ముడుబోయింది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.