నిశ్చితార్థం రద్దు చేసుకుందని వధువుపై కక్ష.. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టింగ్స్!
- చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఇద్దరి మధ్యా వివాహ నిశ్చయం జరిగింది. పెళ్లి జరగాల్సి ఉంది. అతను కాస్త చనువుగా వ్యవహరిస్తుంటే కాబోయే భర్త కదా అని ఊరుకుంది. ఆ సందర్భంలో తీసిన ఫొటోలే ఆమెకు ప్రాణసంకటంగా మారాయి. నిశ్చితార్థం రద్దవడంతో వరుడిలోని వక్రబుద్ధి బయటపడింది. చనువుగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి వేధిస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువతికి గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన విజయభాస్కర్‌తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్త అని ఆమె కాస్త చనువు ఇవ్వడంతో విజయ్‌భాస్కర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు.
అసభ్య చిత్రాలు తీయడమేకాక తన కోరికను తీర్చమని ఒత్తిడి చేసేవాడు. విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో అతని తీరు బాగోలేదని చెప్పి, వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కక్ష కట్టిన నిందితుడు ఆమె పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన చిత్రాలు పోస్టు చేస్తున్నాడు.
సదరు యువతి స్నేహితులకే వాటిని పంపుతుండేవాడు. ఈ విషయాన్ని గుర్తించిన యువతి తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు నిందితుడిని గుర్తించి నిన్న అరెస్టు చేశారు.