ట్రంప్‌తో విందు... థ్యాంక్స్ చెప్పిన సంగీత దర్శకుడు రెహ్మాన్
- రాష్ట్రపతి ఇచ్చిన ఆతిథ్యానికి ఆహ్వానం
- పెద్దన్నకు పరిచయం చేసిన రామ్‌నాథ్ కోవింద్
- ఈ క్షణాలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రెహ్మాన్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చిన విందుకు ఆహ్వానం అందడమేకాదు, ట్రంప్‌తో కాసేపు మాట్లాడే అవకాశం రావడంతో సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన విందుకు దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. వీరిలో రెహ్మాన్ ఒకరు.
విందుకు హాజరైన రెహ్మాన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అమెరికా అధ్యక్షుడికి పరిచయం చేశారు. ఈ అనుభవం పట్ల రెహ్మాన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్టు చేసిన రెహ్మాన్ ‘ఇదో అరుదైన అవకాశం. ఈ సంతోష సమయాన్ని మర్చిపోలేను. ట్రంప్‌కు కృతజ్ఞతలు’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.