ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన పథకం.. ఉపనయనానికి రూ. 15 వేల ఆర్థిక సాయం!
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు
- భారతి పథకం కింద విదేశాల్లో చదువుకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం
- వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉన్నవారు అర్హులు
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ సరికొత్త పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 7 నుంచి 16 ఏళ్ల మధ్యనున్న పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని పిల్లలకు ఉపనయన (ఒడుగు) ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రూ. 15 వేలు అందించనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అలాగే, విదేశాల్లో చదువుకునే బ్రాహ్మణ యువతకు ‘భారతి’ పథకంలో భాగంగా రూ.5 నుంచి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉండి, మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.