చేదు అనుభవాన్ని బయటపెట్టిన పాప్ సింగర్ డఫీ
- డ్రగ్స్ ఇచ్చి బంధించి అత్యాచారం చేశారు
- ఇప్పుడిప్పుడే వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి
- సంగీతానికి ఇన్నేళ్లు దూరం కావడానికి అదే కారణం
ప్రముఖ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత డఫీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన జీవితంలోని ఓ చేదు నిజాన్ని బయటపెట్టింది. గత దశాబ్దకాలంగా తన జీవితంలో అలముకున్న చీకట్ల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నానని, వెలుగులు కనిపిస్తున్నాయన్న డఫీ.. తాను చాలాకాలంగా సంగీతానికి దూరంగా ఉండడానికి కారణం తాను అత్యాచారానికి గురి కావడమేనని పేర్కొంది. మాదకద్రవ్యాలు ఇచ్చి కొంతకాలంపాటు తనను బందీగా ఉంచి ఈ ఘోరానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ ఘోరం నుంచి కోలుకోవడానికి చాలాకాలం పట్టిందని పేర్కొంది. గుండెను చిదిమేసిన ఆ బాధను అనుభవిస్తూ ఎలా పాడగలనని ప్రశ్నించింది. అయితే, ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తే, దానికి తన సమాధానం.. తన బాధను తన కళ్లతో ప్రపంచానికి చూపడం ఇష్టం లేకనే అని వివరించింది. ఇప్పుడు కూడా చెప్పడం సరైనది అవునో, కాదో చెప్పలేనని, కానీ ఇది మాత్రం నిజమని, ప్రస్తుతం బాగానే ఉన్నానని డఫీ పేర్కొంది.