అమరావతికి సరికొత్త నామధేయం... ఇలాగే పిలవాలంటున్న మంగళగిరి ఎమ్మెల్యే!

  • 'బహుజన అమరావతి' అంటూ కొత్త పేరు పెట్టిన ఎమ్మెల్యే
  • త్వరలో 'సర్వజన అమరావతి' అవుతుందంటూ వ్యాఖ్యలు
  • అమరావతి అందరి రాజధానిగా మారబోతోందని వెల్లడి
​మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి పేరును ఆయన 'బహుజన అమరావతి'గా మార్చారు. ఇకపై అమరావతిని ఇలాగే పిలవాలని సూచించారు. సీఎం జగన్ నిర్ణయం తర్వాత అమరావతి 'బహుజన అమరావతి' అవుతుందని, ఆపై 'సర్వజన అమరావతి' అవుతుందని వ్యాఖ్యానించారు. అమరావతి అందరి రాజధానిగా మారబోతోందని, అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాల్లోని 54 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నామని వెల్లడించారు.


More Telugu News