బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ నవాజ్ షరీఫ్ కు సౌకర్యాల నిలిపివేత

  • చికిత్స కోసం లండన్ వెళ్లిన షరీఫ్
  • వైద్య నివేదికలు పంపకుండా తాత్సారం
  • ఇస్లామాబాద్ కోర్టు అనేక లేఖలు రాసినా స్పందించని వైనం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెడరల్ క్యాబినెట్
వైద్య చికిత్స నిమిత్తం లండన్ లో ఉంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైద్య చికిత్స, తన ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలు సమర్పించకుండా నవాజ్ షరీఫ్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని ఫెడరల్ క్యాబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు నవాజ్ షరీఫ్ ను పరారీలో ఉన్న నిందితుడిగా పేర్కొంది. ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలను నాలుగు నెలల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్ హైకోర్టు ఇప్పటికే షరీఫ్ అనేక లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాజీ ప్రధానిగా తనకు అందే సదుపాయాలను షరీఫ్ కోల్పోనున్నారు.


More Telugu News