ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
  • వెలిమల నారాయణ కాలేజీలో ఘటన
  • పటాన్‌చెరు ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం
  • యాజమాన్యం వేధింపుల వల్లేనని ఆరోపణ
సంగారెడ్డి జిల్లా వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఫస్టియర్ చదువుతున్న సంధ్యారాణి మధ్యాహ్న భోజన విరామ సమయంలో బాత్రూములో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం ఆమెను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు ఆసుపత్రి వద్ద అడ్డుకుని ఆందోళనకు దిగాయి.

యాజమాన్యం వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ నుంచి విద్యార్థిని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు విద్యార్థి సంఘాలు, బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.


More Telugu News