పబ్లిక్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు: మంత్రి ఆదిమూలపు

  • మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు
  • మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పదో తరగతి పరీక్షలు
  • అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో మంత్రి ఆదిమూలపు వీడియో కాన్ఫరెన్స్
  • పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు
త్వరలో ఇంటర్, టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, ఆర్ఐవోలతో సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మార్చి 4 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

కాగా, పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలోని స్థానిక జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల కేటాయింపు ఉంటుందని, గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు కూడా ఇన్విజిలేటర్లుగా పనిచేస్తారని అన్నారు. పరీక్షలు జరిగే సమయంలో చీఫ్ సూపర్ వైజర్ మినహా ఎవరి వద్ద ఫోన్లు లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈసారి పరీక్ష కేంద్రాల సమాచారం కోసం యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇక, ఇంటర్ లో ఈసారి గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇస్తామని చెప్పారు.


More Telugu News