ఆ నలుగురు బీజేపీ నేతలపైనా ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
- కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, అభయ్ వర్మ, పర్వేష్ వర్మలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశం
- వారు చేసిన ప్రసంగ వీడియోలను పరిశీలించిన ధర్మాసనం
- పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన కోర్టు
ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, అభయ్ వర్మ, పర్వేష్ వర్మలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. రాజధానిలో జరుగుతున్న హింసకు పై నలుగురే కారణమంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన ధర్మాసనం.. వారు చేసిన ప్రసంగ వీడియోలను పరిశీలించింది.
నలుగురు నేతలపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. వెంటనే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్పుల్లో ధ్వంసమైన ఆస్తి నష్టాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అసమానత ప్రదర్శించారని మండిపడింది. విద్వేష ప్రసంగాలు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.