అనుభవం ఎక్కువుంటే అవకాశాలు అడగలేం: దర్శకుడు పీఎన్ రామచంద్రరావు
- తెలుగులో హిట్ చిత్రాలు తీశాను
- శివాజీ గణేశన్ గారిని డైరెక్ట్ చేశాను
- ఎవరినీ అవకాశాలు అడగలేదన్న పీఎన్
తెలుగులో 'చిత్రం భళారే విచిత్రం' .. 'గాంధీ నగర్ రెండవ వీధి' .. 'మాస్టారి కాపురం' వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా పీఎన్ రామచంద్రరావుకి మంచి పేరు వుంది. నిర్మాతగాను ఆయన పలు చిత్రాలని నిర్మించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "తెలుగులో మంచి దర్శకుడిగా గుర్తింపు వుంది. తమిళంలో శివాజీ గణేశన్ ను కూడా డైరెక్ట్ చేశాను. అలాంటివారి సినిమాలకి దర్శకత్వం వహించిన అనుభవం వుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి సీనియారిటీ వలన ఇబ్బంది కూడా వుంది.
ఒక స్థాయికి వెళ్లాక వ్యక్తిత్వాన్నీ .. స్థాయిని చంపుకుని అవకాశాలు అడగడం కష్టం. ఒకవేళ అడుగుదామనుకుంటే ఎలాంటి అవమానాలు ఎదురవుతాయోననే భయం కూడా వుంది. అందుకు కారణం నా సన్నిహితులు తమకి ఎదురైన అవమానాలను గురించి నాకు చెప్పి ఉండటమే. ఫలానా వారి దగ్గరికి వెళితే ఇలా అన్నారనీ .. అలా ట్రీట్ చేశారని వాళ్లు నా దగ్గర చెప్పేవారు. దాంతో అలాంటి అనుభవమే నాకు ఎదురవుతుందేమోననే భయంతో నేను ఎవరి దగ్గరికీ వెళ్లలేదు .. ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నాకున్న అనుభవాన్ని డిస్ట్రిబ్యూషన్ వైవు మళ్లించాను" అని చెప్పుకొచ్చారు.